ఆనందంలో పొగాకు రైతులు: ఎంపీ బాలశౌరి
ABN , First Publish Date - 2020-07-10T09:25:24+05:30 IST
రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 200 కోట్లు కేటాయించడం

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం: రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 200 కోట్లు కేటాయించడం అభినందనీయమని మచిలీపట్నం ఎంపీ, కేంద్ర పొగాకుబోర్డు సభ్యుడు వల్లభనేని బాలశౌరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు గురువారం లేఖ రాశారు. గ్రేడ్-5, గ్రేడ్8 రకాల పొగాకును ఏపీ మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడానికి ముందుకు రావడంతో కిలో పొగాకు రూ. 50 కూడా పలకని ధర నేడు రూ. 85కు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన లేఖలో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కొనుగోలుకు చొరవ తీసుకోవడంతో ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని పొగాకు కొనుగోలు కేంద్రాల్లో సందడి వాతావరణం నెలకొందని, దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వివరించారు.