విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ‘సినిమా’

ABN , First Publish Date - 2020-08-02T02:22:35+05:30 IST

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది ఆ ఘటన. ఇప్పుడు... ఆ దుర్ఘటనే ఇతివ‌త్తంగా ఓ కథ తెరకెక్కబోతోందని సమాచారం. ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్, మరో సంచలన దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపుదిద్దుకోనున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి.

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ‘సినిమా’

హైదరాబాద్ : విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది ఆ ఘటన. ఇప్పుడు... ఆ దుర్ఘటనే ఇతివ‌త్తంగా ఓ కథ తెరకెక్కబోతోందని సమాచారం. ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్, మరో సంచలన దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపుదిద్దుకోనున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. 


ఈ ఏడాది మే నెలలో విశాఖ గ్యాస్ లేకేజ్ దుర్ఘటన జరిగింది. మొత్తం దేశాన్ని ఈ ఘటన కుదిపేసింది. మొత్తం పదిహేను మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఈ ఘటన ఇతివృత్తంగా సినిమా తీయాలని కొరటాల శిశ నిర్ణయించుకున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది చివరలో... సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. 


Updated Date - 2020-08-02T02:22:35+05:30 IST