నైతిక విజయం టీడీపీదే: కళా వెంకట్రావు

ABN , First Publish Date - 2020-06-20T02:18:30+05:30 IST

రాజ్యసభ ఎన్నికల్లో నైతిక విజయం టీడీపీదేనని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు చెప్పారు. ప్రలోభాలకు ఒత్తిళ్లకు లొంగకుండా తమ అభ్యర్థి వర్ల రామయ్యకు ఓటు వేయడం ద్వారా

నైతిక విజయం టీడీపీదే: కళా వెంకట్రావు

అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో నైతిక విజయం టీడీపీదేనని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు చెప్పారు. ప్రలోభాలకు ఒత్తిళ్లకు లొంగకుండా తమ అభ్యర్థి వర్ల రామయ్యకు ఓటు వేయడం ద్వారా నైతిక విజయం సాధించామని తెలిపారు. శాసనసభ్యులుగా దళితులు ఉన్నా.. రాజ్యసభలో దళితులకు మొండి చేయి చూపించారని ఆరోపించారు. పార్టీ విప్‌ను ధిక్కరించి ముగ్గురు ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చర్యలు తీసుకుంటామని తెలిపారు. వర్ల రామయ్యకు ఓటు వేసిన తమ శాసనసభ సభ్యులందరికి వెంకట్రావు ఈ సందర్భంగా అభినందలు తెలిపారు.

Updated Date - 2020-06-20T02:18:30+05:30 IST