నా రాజకీయ జీవితంలో మరిచిపోలేని రోజు ఇది: మోపిదేవి

ABN , First Publish Date - 2020-06-20T02:25:16+05:30 IST

‘ఈ రోజు నా రాజకీయ జీవితంలో మరిచిపోలేని రోజు’ అని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. శుక్రవారం ఏపీలో నిర్వహించిన రాజ్యసభ ఎన్నికల్లో మోపిదేవి వెంకట రమణ విజయం...

నా రాజకీయ జీవితంలో మరిచిపోలేని రోజు ఇది: మోపిదేవి

అమరావతి: ‘ఈ రోజు నా రాజకీయ జీవితంలో మరిచిపోలేని రోజు’ అని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. శుక్రవారం ఏపీలో నిర్వహించిన రాజ్యసభ ఎన్నికల్లో మోపిదేవి వెంకట రమణ విజయం సాధించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కార్యకర్త విలువ తెలిసిన వ్యక్తిగా జగన్ ఉన్నారని కొనియాడారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా అగ్నికుల క్షత్రియ నుంచి దేశంలోనే తొలిసారి రాజ్యసభలోకి తనకు అవకాశం కల్పించారని అన్నారు. తనతో రాజకీయ ఓనమాలు దిద్దించిన సింగం బసవ పున్నయ్యను, తన ఎదుగుదలకు వెన్నంటి నిలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిలను ఈ సందర్భంగా వెంకటరమణ గుర్తుచేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంతీయ పార్టీలంటే కార్యకర్తలను వాడుకునే విధంగా ఉంటాయని, కానీ వైఎస్ జగన్ మాత్రం పార్టీ కార్యకర్తలకు గుర్తింపునిస్తారని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం నత్వాని, అయోధ్య రామిరెడ్డిలకు అవకాశం కల్పించారని అన్నారు.

Updated Date - 2020-06-20T02:25:16+05:30 IST