పల్నాడును టీడీపీ రెచ్చగొడుతోంది: మోపిదేవి

ABN , First Publish Date - 2020-03-12T16:09:08+05:30 IST

ప్రశాంతంగా ఉన్న పల్నాడును టీడీపీ రెచ్చగొడుతోందని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. అరండల్ పేటలో గ్రాండ్ నాగార్జున హోటల్‌ను మంత్రి

పల్నాడును టీడీపీ రెచ్చగొడుతోంది: మోపిదేవి

గుంటూరు: ప్రశాంతంగా ఉన్న పల్నాడును టీడీపీ రెచ్చగొడుతోందని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. అరండల్ పేటలో గ్రాండ్ నాగార్జున హోటల్‌ను మంత్రి మోపిదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కృషి చేస్తోందని పేర్కొన్నారు. పల్నాడు ప్రాంతంలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమాకు ఏం పని? అని ప్రశ్నించారు. డీజీపీ ఆఫీస్ దగ్గర చంద్రబాబు ధర్నా చేయడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. టీడీపీది రాజ్యసభ సీట్లు అమ్ముకునే సంస్కృతి అని విమర్శించారు. అమ్ముకునే సంస్కృతికి భిన్నంగా వైసీపీ వ్యవహరించిందని తెలిపారు. రిలయన్స్ నుంచి ఎన్నికోట్లు తీసుకుని రాజ్యసభ సీటు ఇచ్చారంటూ వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముస్తాఫా, మద్దాల గిరి, ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-12T16:09:08+05:30 IST