మాజీ మంత్రి మోకా శ్రీవిష్ణు ప్రసాద్ రావు కన్నుమూత

ABN , First Publish Date - 2020-12-27T22:53:44+05:30 IST

మాజీ మంత్రి మోకా శ్రీవిష్ణు ప్రసాద రావు(95) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. అమలాపురంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

మాజీ మంత్రి మోకా శ్రీవిష్ణు ప్రసాద్ రావు కన్నుమూత

తూర్పుగోదావరి: మాజీ మంత్రి మోకా శ్రీవిష్ణు ప్రసాద రావు(95) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. అమలాపురంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన 1972 నుంచి 1977  వరకు అల్లవరం నియోజకవర్గం ఎమ్మెల్యే‌గా ఉన్నారు. 1977లో కొత్తగా ముమ్మిడివరం నియోజకవర్గం ఏర్పడగా.. నియోజకవర్గ తొలి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చెన్నారెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రిగా పనిచేశారు. అంతకు ముందు కాట్రేనికోన గ్రామపంచాయతీకి సర్పంచిగా 18 ఏళ్లు పనిచేశారు.  

Updated Date - 2020-12-27T22:53:44+05:30 IST