రాష్ట్ర ప్రజల నోట్లో మోదీ మట్టికొట్టారు: బాబూరావు
ABN , First Publish Date - 2020-10-21T22:55:12+05:30 IST
రాష్ట్ర ప్రజల నోట్లో ప్రధాని మోదీ మట్టి కొట్టారని, ఆయన రాజధానికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు గడిచినా నిధులు ఇవ్వకుండా అమరావతిని దెబ్బతీశారని సీపీఎం నేత బాబూరావు మండిపడ్డారు.

అమరావతి: రాష్ట్ర ప్రజల నోట్లో ప్రధాని మోదీ మట్టి కొట్టారని, ఆయన రాజధానికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు గడిచినా నిధులు ఇవ్వకుండా అమరావతిని దెబ్బతీశారని సీపీఎం నేత బాబూరావు మండిపడ్డారు. రాజధాని, హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ద్రోహం చేసిన బీజేపీతో వైసీపీ, టీడీపీ, జనసేన జతకట్టాయని తప్పుబట్టారు. రాజధాని రక్షణ, హామీల అమలు, బీజేపీ ద్రోహంపై నవంబర్ 1 నుండి 15 వరకు ఆందోళనలు చేస్తామని బాబూరావు ప్రకటించారు. ఆంధ్రుల రాజధాని అమరావతే.. అంటూ రాజధాని 29 గ్రామాల ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఏకైక రాజధాని అమరావతే అని ప్రభుత్వం ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందని రాజధాని రైతులు, మహిళలు తేల్చి చెబుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తోన్న రైతులకు టీడీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు మద్దతు పలికారు.