మండలికి పెన్మత్స సురేశ్‌

ABN , First Publish Date - 2020-08-12T09:13:58+05:30 IST

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత, దివంగత పెన్మత్స సాంబశివరాజు కుమారుడు పెన్మత్స సూర్యనారాయణరాజు(సురేశ్‌)కు ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వాలని సీఎం

మండలికి పెన్మత్స సురేశ్‌

 అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత, దివంగత పెన్మత్స సాంబశివరాజు కుమారుడు పెన్మత్స సూర్యనారాయణరాజు(సురేశ్‌)కు ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వాలని సీఎం జగన్‌ మంగళవారం నిర్ణయించారు. ఎమ్మెల్యే కోటాలో సురేశ్‌ను మండలికి పంపనున్నారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి రాజీనామాతో ఖాళీగా ఉన్న స్థానానికి ఈ నెలలో ఎన్నిక జరగనుంది. వాస్తవానికి 2019లో తమ కుటుంబానికి నెల్లిమర్ల లేదా మరేదైనా ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని సాంబశివరాజు జగన్‌ను అభ్యర్థించారు. అయితే, గెలుపు ఓటములపై అంచనాలు వేసుకున్న జగన్‌ మౌనం వహించారు. ఇక ఇప్పుడు సాంబశివరావు మరణించిన రెండో రోజే ఖాళీగా ఉన్న ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయన తనయుడికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Updated Date - 2020-08-12T09:13:58+05:30 IST