వైసీపీ నేతలకు ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి సవాల్

ABN , First Publish Date - 2020-09-06T20:44:16+05:30 IST

వైసీపీ నేతలకు ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యముంటే రీకాల్ బిల్లు పెట్టాలని సవాల్ విసిరారు. అప్పుడు ప్రజలే తేలుస్తారని, మీ పనితీరు ఎలా ఉందో ప్రజలకు

వైసీపీ నేతలకు ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి సవాల్

అమరావతి: వైసీపీ నేతలకు ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యముంటే రీకాల్ బిల్లు పెట్టాలని సవాల్ విసిరారు. అప్పుడు ప్రజలే తేలుస్తారని, మీ పనితీరు ఎలా ఉందో ప్రజలకు తెలుస్తుందన్నారు. మీ కథ చూస్తాం.. మీ సంగతి తేలుస్తామనేవారు రావాలని, ఎవరి దమ్ము ఏంటో తేలాలంటే ఫ్రెండ్లీ బాక్సింగ్‌ మ్యాచ్‌ పెట్టుకుందామని చెప్పారు. ‘‘దమ్మున్న వైసీపీ నాయకుడెవడో పేరు ఇవ్వమనండి. బూతులు తిట్టడంలో అయినా పోటీ పెట్టుకుందాం. వైసీపీ నుంచి ఎవరు వస్తారో రండి. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రప్రగతిని చూసి దేశం నవ్వుతోంది. అప్పులు తేవడంలో 1వ స్థానం, కరోనా వ్యాప్తిలో 2వ స్థానం.. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ప్రత్యేక హోదాపై పోరాటం అంటూ కేంద్రం బిల్లులకు మద్దతిస్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అని.. భవిష్యత్‌లో రేప్‌లు, మర్డర్లు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు’’ అని దీపక్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


Updated Date - 2020-09-06T20:44:16+05:30 IST