ఈ విలువలు అప్పుడు గుర్తుకు రాలేదా?: బుద్దా
ABN , First Publish Date - 2020-10-21T09:03:50+05:30 IST
ఈ విలువలు అప్పుడు గుర్తుకు రాలేదా?: బుద్దా

విజయవాడ, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): చంద్రబాబును విమర్శిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లకు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా కౌంటరు ఇచ్చారు. ‘ఒక కోతి స్వయంగా కోతి సామెతలు చెప్పుకోవడం బహుశా ఎప్పుడూ చూసి ఉండం. వ్యవస్థలను భ్రష్టు పట్టించి పదహారు నెలలపాటు ఊచలు లెక్కపెట్టిన నాడు ఈ విలువలు గుర్తుకు రాలేదా?’ అని ఎద్దేవా చేశారు.