ఐఏఎస్‌లను ‘అయ్యా.. ఎస్‌’లుగా మార్చేశారు: బుద్దా

ABN , First Publish Date - 2020-07-14T08:29:19+05:30 IST

రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ తన ఇష్టానుసారం ఆడుకుంటున్నారని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా

ఐఏఎస్‌లను ‘అయ్యా.. ఎస్‌’లుగా మార్చేశారు: బుద్దా

విజయవాడ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ తన ఇష్టానుసారం ఆడుకుంటున్నారని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. సోమవారం ఆయన టీడీపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తన తండ్రి హయాంలో తప్పులు చేసిన అధికారులందరినీ తనతోపాటు జైలు జీవితం గడిపేలా చేసింది జగన్‌ కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్‌ తన మాట వినని ఐఏఎస్‌ అధికారులను పక్కనబెడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ అధికారంలోకి రాకముందు ఆయనకు చేదోడువాదోడుగా ఉన్న ఐఏఎస్‌ అధికారులైన ఎల్వీ సుబ్రహ్మణ్యం, కృష్ణకిశోర్‌, నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సహా అజయ్‌ కల్లం రెడ్డి, పి.వి.రమేశ్‌లను ‘అయ్యా! ఎస్‌’ అనేలా చేశారని తెలిపారు. జగన్‌ వ్యవహారశైలిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Updated Date - 2020-07-14T08:29:19+05:30 IST