‘జగన్ రెడ్డి, సాయి రెడ్డి పొరపాటున గ్రామాల్లోకి వెళ్ళకండి’

ABN , First Publish Date - 2020-04-05T19:18:57+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ

‘జగన్ రెడ్డి, సాయి రెడ్డి పొరపాటున గ్రామాల్లోకి వెళ్ళకండి’

అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సెటైర్ల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఇవాళ రైతుల గోడు గురించి ఆయన వరుస ట్వీట్లు చేశారు.


అర్ధం అవుతోందా!?

జగన్ రెడ్డి గారు, సాయి రెడ్డి గారు పొరపాటున గ్రామాల్లోకి వెళ్ళకండి అర్ధం అవుతోందా?. రైతులు అరిగిపోయిన చెప్పులు పట్టుకొని తిరుగుతున్నారు. అన్న వస్తాడు ప్రతి రైతుకి ఏడాదికి లక్ష రూపాయిలు ప్రభుత్వ సహాయం అందుతుందని ఎన్నికల ముందు ఊదరగొట్టారు. పంట వెయ్యకముందే గిట్టుబాటు ధర ప్రకటిస్తాం అన్నారు. మీ హామీలన్నీ ఏమయ్యాయ్..? ఆఖరికి పండిన పంట రవాణా చేసుకునే వసతులు కూడా కల్పించలేని దద్దమ్మ ప్రభుత్వం, రైతులు పండించిన పంటని పొలాల్లోనే పారబోస్తున్నారు. కనీస ఏర్పాట్లు కూడా చెయ్యకుండా రైతులను జీవిత కాలం దెబ్బతీశారు. రైతు భరోసాలో 5 వేలు కోసారు. అన్ని కోనేసాం అంటున్నావు.. అంటున్నావ్ ఏంటి..? అవి సాయి రెడ్డి గారు సన్న బియ్యం అని గడ్డ కట్టిన బియ్యం ప్రజలకు పంచారు. అవేనా వేల కోట్లు దోపిడీ చేసి జగన్ రెడ్డి కొన్న నూక బియ్యంఅని విజయసాయిరెడ్డి సైటైర్ల వర్షం కురిపించారు.Updated Date - 2020-04-05T19:18:57+05:30 IST