మామా... సూపర్‌... అందుకే నీతోనే..

ABN , First Publish Date - 2020-03-24T08:41:28+05:30 IST

చెరపకురా చెడేవు అన్నట్లు చంద్రబాబు మీదకి వెళ్తుందని సీబీఐకి అనుమతిస్తే అది కాస్త జగన్‌ అండ్‌ కోకి రివర్స్‌ అయిందని

మామా... సూపర్‌... అందుకే నీతోనే..

అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): చెరపకురా చెడేవు అన్నట్లు చంద్రబాబు మీదకి వెళ్తుందని సీబీఐకి అనుమతిస్తే అది కాస్త జగన్‌ అండ్‌ కోకి రివర్స్‌ అయిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోమవారం రాత్రి ట్వీట్‌ చేశారు. చమత్కారంగా వెంకన్న చేసిన ట్వీట్‌ ఇది.. 

ఏ2: అల్లుడూ మనం వీకయ్యాం.

ఏ1: ఎక్కడ మామా?

ఏ2: కోర్టులు ఉతికి ఆరేస్తున్నాయ్‌. బాబుపైకి వెళ్తుందని సీబీఐకి అనుమతించాం. కానీ సీబీఐ వాళ్లు బాత్రూమ్‌లో బాబాయ్‌ కేసుతో మన దగ్గరకే వచ్చారు. 

ఏ1: ఇప్పుడేం చేద్దాం!

ఏ2: మనమీదకొచ్చిన సీబీఐని రాజధాని భూముల కేసు పేరుతో వాళ్ల మీదకి పంపేద్దాం.

ఏ1: మన సబ్‌ కమిటీలు, సీఐడీ పట్టుకోలేనిది వాళ్లకేమి దొరుకుతుంది మామా?

ఏ2: దొరకదల్లుడూ..! నువ్వు ప్రెస్‌మీట్‌కి వచ్చి పెట్టిన పెంట, కోర్టుల దెబ్బలు, బాబాయ్‌ బాత్రూమ్‌ కేసు... డైవర్ట్‌ చేయొచ్చు. 

ఏ1: నువ్వు సూపర్‌ మామ! అందుకే ఎక్కడికెళ్లినా నీతోనే! ఏం చేసినా నీ వెంటే! - బుద్దా ట్వీట్‌

Read more