బిల్లుల ఆమోదం కోసమే అసెంబ్లీ సమావేశాలు:ఎమ్మెల్సీ అశోక్‌బాబు

ABN , First Publish Date - 2020-11-26T23:45:52+05:30 IST

అసెంబ్లీ సమావేశాలను కేవలం బిల్లుల ఆమోదం కోసమే నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు.

బిల్లుల ఆమోదం కోసమే అసెంబ్లీ సమావేశాలు:ఎమ్మెల్సీ అశోక్‌బాబు

అమరావతి: అసెంబ్లీ సమావేశాలను కేవలం బిల్లుల ఆమోదం కోసమే నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు.  ప్రశ్నోత్తరాలు లేకుండా, మీడియాను అనుమతించకుండా  ఈ సమావేశాలు నిర్వహించాలనుకోవడం  జగన్ నిరంకుశ విధానమన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోతున్నారన్నారు.  ప్రభుత్వ విధానాలు, పాలనలోని లోపాలు ప్రజలకు తెలియాలంటే మీడియాను అనుమతించాలని చెప్పారు. సభ సజావుగా జరగాలని బీఏసీలో స్పీకర్‌పై ఒత్తిడి తెస్తామని అశోక్‌బాబు అన్నారు. 

Updated Date - 2020-11-26T23:45:52+05:30 IST