ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావుపై వాసుపల్లి గణేష్ ఘాటు వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-12-31T00:08:08+05:30 IST
టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావుపై విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు

విశాఖ: టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావుపై విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘నాగజగదీశ్వరరావు ఊర పందిలా ఉంటాడు. కోస్తే అనకాపల్లికి సరిపోతాడు. దక్షిణ నియోజకవర్గ ప్రజలకు అనకాపల్లిలో ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని నాగజగదీశ్వరరావు పిల్ వేశారు. ఖబడ్దార్ నాగజగదీశ్వరరావు.. నాలుక కోస్తా. నేను ఇన్నాళ్లు టీడీపీలో పందులతో ఉన్నాను..ఇప్పుడు బురద కడుక్కొని వైసీపీలోకి వచ్చాను. అయినా పందులతో మనం ఎప్పుడూ సహవాసం చేయకూడదు. చేస్తే మనకు బురద అంటించి అవి ఆనందపడతాయి’ అంటూ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన సభలో వాసుపల్లి గణేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.