-
-
Home » Andhra Pradesh » MLA Sivakumar
-
పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే శివకుమార్
ABN , First Publish Date - 2020-11-27T22:08:27+05:30 IST
పలు ప్రాంతాల్లో నివార్ తుపాన్ వల్ల పంటలకు అధిక నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని అంచనా వేయడానికి ఎమ్మెల్యే శివకుమార్ తెనాలి మండలం కంచర్ల పాలెం గ్రామంలోని పంటలను పరిశీలించారు.

తెనాలి: మండలంలో నివార్ తుపాన్ వల్ల పంటలకు అధిక నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని అంచనా వేయడానికి ఎమ్మెల్యే శివకుమార్ మండలంలోని కంచర్ల పాలెం గ్రామంలో పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఎమ్మెల్యేకు గోడును వెళ్లబోసుకున్నారు. పంటలన్నీ నీట మునిగిపోయాయన్నారు. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి పంట నష్టంపై రైతులతో మాట్లాడారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.