దాతల సొమ్ముతో... ఎమ్మెల్యే సేవ!

ABN , First Publish Date - 2020-04-18T10:16:25+05:30 IST

కరోనా నియంత్రణకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయంతోపాటు దాతలు ఇచ్చే సొమ్మును అధికార పార్టీ

దాతల సొమ్ముతో... ఎమ్మెల్యే సేవ!

కర్నూలు, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయంతోపాటు దాతలు ఇచ్చే సొమ్మును అధికార పార్టీ నేతలు తమ ప్రచారానికి వాడుకుంటున్నారు. శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఆయన అనుచరులు సత్రాల నిర్వాహకుల నుంచి భారీగా విరాళాలు సేకరించారు. ఒక్కో సత్రం సమాఖ్య నుంచి రూ.3 వేలు సేకరించినట్టు సమాచారం. మొత్తం 46 సత్రాల నుంచి సేకరించిన సొమ్ముతో లింగాలగట్టు, సున్నిపెంట ప్రాంతాల్లోని 200 మందికి బియ్యం,కూరగాయలను పంపిణీ చేశారు. అయితే ఎమ్మెల్యే తన సొంత నిధులతో వీటిని పంపిణీ చేస్తున్నానని ప్రకటించుకోవడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఎమ్మెల్యే పర్యటనను అధికారులు పట్టించుకోలేదు.

Updated Date - 2020-04-18T10:16:25+05:30 IST