-
-
Home » Andhra Pradesh » MLA Payyavala Keshav Input subsidy
-
రైతు సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
ABN , First Publish Date - 2020-12-10T23:10:00+05:30 IST
జిల్లాలో 33 మండలాల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు.

అనంతపురం: జిల్లాలో 33 మండలాల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ నిరంకుశ విధానాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని మండిపడ్డారు. తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్‌పుట్ సబ్సిడీ కోసం 'రైతు కోసం' పేరుతో పోరాటం చేస్తామని చెప్పారు.
నియోజకవర్గ స్థాయిలో ఆందోళనలు: కాలవ శ్రీనివాసులు
ఈ క్రాప్ బుకింగ్‌లోని రైతుల జాబితాను గ్రామ సచివాలయంలో ప్రకటించాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. గతంలో ఇన్సూరెన్స్ రాని మండలాలకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరారు. రైతుల తరఫున టీడీపీ పోరాడుతుందని చెప్పారు. టీడీపీ నిరసనలు చేపడితేనే రూ.500 కోట్లు చెల్లించారని అన్నారు. ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ కోసం క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని తెలిపారు.