‘వంత పాడి తప్పులు చేసి చిక్కులు తెచ్చుకోవద్దు’

ABN , First Publish Date - 2020-07-20T20:56:50+05:30 IST

ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.

‘వంత పాడి తప్పులు చేసి చిక్కులు తెచ్చుకోవద్దు’

పశ్చిమగోదావరి: ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల హక్కును హరించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అని ఆయన ప్రశ్నించారు. స్థానిక ప్రజాప్రతినిధిగా తన హక్కులకు, విధులకు భంగం కలిగిస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రజల చేత తిరస్కరించబడిన  నాయకులు పెత్తనం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అనుభవం అవగాహన లేని వైసీపీ నేతల వలనే పాలకొల్లులో కోవిడ్  కేసులు పెరుగుతున్నాయని మండిపడ్డారు. అధికారులు వైసీపీ నాయకులకు వంత పాడి తప్పులు చేసి  చిక్కులు తెచ్చుకోవద్దని సూచించారు. 

Updated Date - 2020-07-20T20:56:50+05:30 IST