సభ్య సమాజం తలదించుకునే టీడీపీ నేతల తీరు: ఎమ్మెల్యే గిరిధర్
ABN , First Publish Date - 2020-06-18T16:33:44+05:30 IST
సభ్య సమాజం తలదించుకునే టీడీపీ నేతల తీరు: ఎమ్మెల్యే గిరిధర్
గుంటూరు: శాసనమండలిలో టీడీపీ నేతలు తీరు చూస్తే సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ విమర్శించారు. ద్రవ్యబిల్లును అడ్డుకుని ఇష్టానుసారంగా వ్యవహరించి మంత్రులపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకి ద్రవ్య బిల్లు ప్రాధాన్యత తెలియదా అని ప్రశ్నించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పైన దాడికి పాల్పడ్డారన్నారు. శాసనమండలిలో టీడీపీ నేతలు రౌడీయిజం చేలాయించారని దుయ్యబట్టారు. ఆర్యవైశ్యలు అందరూ వెల్లంపల్లి శ్రీనివాస్‌పై దాడిని ఖండిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలోనే అన్ని సంక్షేమ పథకాలను అమలు చేశామని తెలిపారు. వైసీపీ పార్టీకి మంచి పేరు వస్తుందని దురుదేశ్యంతోనే బడ్జెట్ సమావేశాలను అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే గిరిధర్ వ్యాఖ్యానించారు.