మూడులాంతర్లను పురాతన కట్టడంగా నిరూపిస్తే...: ఎమ్మెల్యే కోలగట్ల
ABN , First Publish Date - 2020-05-24T16:01:04+05:30 IST
మూడులాంతర్లను పురాతన కట్టడంగా నిరూపిస్తే...: ఎమ్మెల్యే కోలగట్ల

విజయనగరం: మూడులాంతర్లను పురాతన కట్టడంగా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సవాల్ విసిరారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తాతల నాడు నేతులు తాగాం.. ఇప్పుడు మా మూతులు చూడండి అన్న రోజులు పోయాయన్నారు. పూసపాటి అశోక్ గజపతిరాజు ఎప్పుడైనా ఓ లక్ష రూపాయిలు దాణం చేసిన సందర్భం ఉందా అని ప్రశ్నించారు. తాము రూపొందించిన డిజైన్లో మూడులాంతర్ల కూడలిని నెల రోజుల్లో నిర్మిస్తామని స్పష్టం చేసిన ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తన అనుచరగణంతో శంకుస్థాపన చేశారు.