బనగానపల్లెలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య వివాదం
ABN , First Publish Date - 2020-10-03T20:48:38+05:30 IST
కర్నూలు: బనగానపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి వర్గీయుల

కర్నూలు: బనగానపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి వర్గీయుల మధ్య క్రషర్ వివాదం నెలకొంది. బీసీ జనార్దన్‌రెడ్డికి చెందిన యంత్రాలు తరలించకుండా.. కాటసాని వర్గీయులు టిప్పర్లు అడ్డుపెట్టారు. ఇరువర్గాలతో పోలీస్ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. స్టోన్ క్రషర్ వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. కోర్టు ఆదేశాలున్నా యంత్రాలు తరలించకుండా.. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.