‘మీ ఫ్యాక్షన్ కత్తిని ఉద్యోగులపై ప్రయోగిస్తారా?’

ABN , First Publish Date - 2020-02-12T22:32:07+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బహిరంగ లేఖ రాశారు. కొంతమంది ఉన్నతాధికారులపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అధికారులకు పోస్టింగులు

‘మీ ఫ్యాక్షన్ కత్తిని ఉద్యోగులపై ప్రయోగిస్తారా?’

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బహిరంగ లేఖ రాశారు. కొంతమంది ఉన్నతాధికారులపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా నెలల తరబడి నిరీక్షణలో ఉంచుతున్నారని అన్నారు. ‘ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల ప్రాణాలు తీసిన మీ ఫ్యాక్షన్ కత్తిని.. ప్రభుత్వ ఉద్యోగులపైనా ప్రయోగించడం దారుణం’ అని ఎమ్మెల్యే అనగాని తన లేఖలో ఘాటైన వ్యాఖ్యలతో సీఎం తీరుపై విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించిన ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని తొలగించారని విమర్శించారు. 30 ఏళ్ల అనుభవం ఉన్న ఐపీఎస్ అధికారిపై దేశద్రోహం ముద్ర వేయడం ఏంటని లేఖలో సీఎంను నిలదీశారు.

Updated Date - 2020-02-12T22:32:07+05:30 IST