అమ్మకానికి మంత్రాలయం మఠం భూములు!

ABN , First Publish Date - 2020-11-27T09:48:06+05:30 IST

తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా ఆయిజ మండలంలోని గ్రామాల్లో ఉన్న మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం భూములను విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. ఇం దుకుగాను గత ఏడాది మఠం యాజమా న్యం దేవదాయ ధర్మాదాయ శాఖ అనుమతి కోరింది.

అమ్మకానికి మంత్రాలయం మఠం భూములు!

డిసెంబరు 7న వేలం ..

నిర్వహించనున్న యాజమాన్యం

కబ్జా నుంచి కాపాడుకోలేకే వేలం


మంత్రాలయం, నవంబరు 26. తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా ఆయిజ మండలంలోని గ్రామాల్లో ఉన్న మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం భూములను విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. ఇం దుకుగాను గత ఏడాది మఠం యాజమా న్యం దేవదాయ ధర్మాదాయ శాఖ అనుమతి కోరింది. ఈ నేపథ్యంలో మఠం భూ ములను నవంబరులో అమ్ముకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 7 నుంచి 10లోపు పక్రియ ను పూర్తి చేయాలని పేర్కొంది. ప్రస్తుతం తుంగభద్ర పుష్కరాలు ఉండడంతో మ ఠం గడువు కోరింది. తెలంగాణలోని పది గ్రామాల్లో 208.51 ఎకరాలు విక్రయించేందుకు ఈ గడువు చాలదని, సమయం పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు మ ఠం ఏఏవో తెలిపారు. భూములు కబ్జాకు గురవుతున్నట్లు తెలియడంతో వాటిని అమ్మి వచ్చిన మొత్తాన్ని ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Read more