మంత్రాలయం ఆస్తులు

ABN , First Publish Date - 2020-11-27T09:49:44+05:30 IST

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఉద్ధేశపూర్వకంగానే హిందూ ధర్మ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి మండిపడ్డారు.

మంత్రాలయం ఆస్తులు

అమ్మితే ఊరుకోం: బీజేపీ

అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఉద్ధేశపూర్వకంగానే హిందూ ధర్మ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి మఠానికి చెందిన 208 ఎకరాల భూములను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేలం ప్రకటన ఇవ్వడం దారుణమన్నారు. మొన్న తిరుపతి వెంకన్న స్థలాలు, నిన్న విశాఖలో అప్పన్న ఆస్తులు, తాజాగా కర్నూలు జిల్లాలో మఠం భూములను విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తూ మతానికో విధానాన్ని అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మానికి చెం దిన భూములను వేలం వేసే హక్కు ప్ర భుత్వానికి లేదని, తన తప్పుడు నిర్ణయా న్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదం టే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.  

Read more