కెమికల్ ప్రభావం తగ్గిందని నిరూపించేందుకు స్వయంగా మంత్రులే..

ABN , First Publish Date - 2020-05-12T02:42:53+05:30 IST

ల్జీ పాలిమర్స్ ప్రభావిత గ్రామాల్లో స్టైరిన్ కెమికల్ ప్రభావం తగ్గిందని ప్రజలు నిరూపించేందుకు మంత్రులే స్వయంగా రంగంలోకి దిగారు. ప్రజలకు భరోసా కల్పించేందుకు స్వయంగా మంత్రులే

కెమికల్ ప్రభావం తగ్గిందని నిరూపించేందుకు స్వయంగా మంత్రులే..

విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ ప్రభావిత గ్రామాల్లో స్టైరిన్ కెమికల్ ప్రభావం తగ్గిందని ప్రజలు నిరూపించేందుకు మంత్రులే స్వయంగా రంగంలోకి దిగారు. ప్రజలకు భరోసా కల్పించేందుకు స్వయంగా మంత్రులే సదరు గ్రామాల్లో బస చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వెంకటాపురంలో ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ బస చేయనున్నారు. పద్మనాభపురంలో మంత్రి అవంతి శ్రీనివాస్, విజయసాయిరెడ్డి, కంపరపాలెం గ్రామంలో మంత్రి కన్నబాబు, నందమూరి నగర్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎస్సీ, బీసీ కాలనీలో ధర్మాన కృష్ణదాసు రాత్రికి బస చేయనున్నారు.

Updated Date - 2020-05-12T02:42:53+05:30 IST