అప్పటి వరకు భక్తులను అనుమతించం: మంత్రి

ABN , First Publish Date - 2020-05-18T22:16:18+05:30 IST

మే 31వ తేదీ వరకు దేవాలయాల్లో భక్తులను అనుమతించడం లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇదే విషయమై సోమవారం ఇక్కడ..

అప్పటి వరకు భక్తులను అనుమతించం: మంత్రి

విజయవాడ: మే 31వ తేదీ వరకు దేవాలయాల్లో భక్తులను అనుమతించడం లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇదే విషయమై సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం లాక్‌ డౌన్ కాలపరిమితిని మే నెల 31వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నామని తెలిపారు. గతంలో ఇచ్చిన ఆదేశాలను కొనసాగిస్తున్నట్లు మంత్రి చెప్పారు. అయితే అన్ని దేవాలయాల్లో యధావిధిగా నిత్య పూజలు, సాంప్రదాయం ప్రకారం కొనసాగుతాయన్నారు. అదేవిధంగా ఆర్జిత సేవల కోసం ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు జరిపి పరోక్షంగా సేవలు అందించే విధంగా అన్ని దేవాలయాల్లో ఏర్పాటు చేసుకోవాలని కార్యనిర్వాహక అధికారులను మంత్రి ఆదేశించారు.

Updated Date - 2020-05-18T22:16:18+05:30 IST