త్వరలోనే కాణిపాకం ఆలయం మాస్టర్ ప్లాన్ అమలు: మంత్రి వెల్లంపల్లి

ABN , First Publish Date - 2020-08-22T18:06:55+05:30 IST

కాణిపాకం వినాయకుని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.

త్వరలోనే కాణిపాకం ఆలయం మాస్టర్ ప్లాన్ అమలు: మంత్రి వెల్లంపల్లి

చిత్తూరు: కాణిపాకం వినాయకుని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సస్య శ్యామలం కావాలని దేవున్ని ప్రార్థించానని అన్నారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న ఆలయాలకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని తెలిపారు. త్వరలోనే కాణిపాకం ఆలయం మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే కాణిపాకం ఆలయానికి  బంగారు రథంను  తీసుకువస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఎన్ని అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా చంద్రబాబు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రఘురామకృష్ణం రాజు ఢిల్లీలో హాయిగా కూర్చొని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. కోవిడ్ వల్లే వినాయక చవితి సంబరాలపై ఆంక్షలు విధించామని వివరించారు. కరోనా తగ్గుముఖం పట్టాలని ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని  వినాయక స్వామి వారిని వేడుకున్నానని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. 

Updated Date - 2020-08-22T18:06:55+05:30 IST