భగవంతుణ్ణి అదే కోరుకున్నాను: మంత్రి వెల్లంపల్లి

ABN , First Publish Date - 2020-08-12T01:36:03+05:30 IST

వేదిక కళ్యాణ మండపంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్, తదితరులు హాజరయ్యారు.

భగవంతుణ్ణి అదే కోరుకున్నాను: మంత్రి వెల్లంపల్లి

విజయవాడ : వేదిక కళ్యాణ మండపంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్, తదితరులు హాజరయ్యారు. కృష్ణుడి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అభిషేకాలు, కృష్ణ భగవానుడి కీర్తనలు నిర్వహించారు. మంత్రి వెల్లంపల్లిని శ్రీకృష్ణ భక్తులు సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలకు హాజరవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నానని మంత్రి తెలిపారు.

Updated Date - 2020-08-12T01:36:03+05:30 IST