తిరుమలకొండపై మంత్రి రాజకీయ విమర్శలు

ABN , First Publish Date - 2020-08-22T09:21:27+05:30 IST

ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలకొండపై రాజకీయాలు మాట్లాడకూడదనేది టీటీడీ నిబంధన.

తిరుమలకొండపై   మంత్రి రాజకీయ విమర్శలు

రఘురామరాజు పనికిమాలిన నేత

వైసీపీ ఎంపీపై వెలంపల్లి ఆగ్రహం


తిరుమల, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలకొండపై రాజకీయాలు మాట్లాడకూడదనేది టీటీడీ నిబంధన. దీనిని సాక్షాత్తూ దేవదాయ మంత్రే ఉల్లంఘించడం విమర్శలకు తావిచ్చింది. శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఢిల్లీలో చెట్లకింద కూర్చుని పంచాయతీలు, నీచ రాజకీయాలు చేసే పనికిమాలిన రాజకీయ నాయకుడని విమర్శించారు.

Updated Date - 2020-08-22T09:21:27+05:30 IST