బాబు పాలన.. అమరావతి.. రెండూ గ్రాఫిక్సే: సుచరిత

ABN , First Publish Date - 2020-07-05T08:59:11+05:30 IST

‘‘అమరావతి పేరుతో జూమ్‌ వీడియోలు, ఫొటో మాయాజాలం తప్ప చంద్రబాబు చేసింది ఏమీలేదు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో చేసినవే... అబద్ధాలు, జిమ్మిక్కులు, గ్రాఫిక్స్

బాబు పాలన.. అమరావతి.. రెండూ గ్రాఫిక్సే: సుచరిత

గుంటూరు, జూలై 4: ‘‘అమరావతి పేరుతో జూమ్‌ వీడియోలు, ఫొటో మాయాజాలం తప్ప చంద్రబాబు చేసింది ఏమీలేదు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో చేసినవే... అబద్ధాలు, జిమ్మిక్కులు, గ్రాఫిక్స్ మాయాజాలాలు, తప్పుడు ప్రచారాలు... అవే ఇప్పుడు అమరావతి ఉద్యమంలో చేస్తున్నారు’’ అని హోం మంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. 200 గడపలు కూడా లేని ఉద్యమాన్ని 200 దేశాల ఉద్యమంలా చెప్పటం టీడీపీకే చెల్లిందన్నారు. అమరావతి ఉద్యమం అని గొంతు చించుకొంటోన్న చంద్రబాబు కనీసం మంగళగిరిలో లోకేశ్‌ను ఎందుకు గెలిపించుకోలేకపోయారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Updated Date - 2020-07-05T08:59:11+05:30 IST