-
-
Home » Andhra Pradesh » minister sriranganatharaju west godavari
-
రఘురామకృష్ణంరాజును గౌరవంగా చూసుకుంటాం: మంత్రి శ్రీరంగనాథరాజు
ABN , First Publish Date - 2020-06-22T20:52:07+05:30 IST
రఘురామకృష్ణంరాజును గౌరవంగా చూసుకుంటాం: మంత్రి శ్రీరంగనాథరాజు

ఏలూరు: తనకు ప్రాణహాని ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీరంగనాథరాజు స్పందించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి భద్రత కావాలన్నా ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. రఘురామకృష్ణంరాజు తమ పార్లమెంట్ సభ్యులని.. ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా గౌరవంగా చూసుకుంటామని... ఆయనకు పూర్తి భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇదేమీ ఫ్యాక్షన్ ఏరియా కాదన్నారు. ఆయన ఎవరికీ భయపడనవసరం లేదని... 15 లక్షల మందికి ప్రజాప్రతినిధి ఆయన అని మంత్రి తెలిపారు. ఇళ్ల స్థలాలలో అక్రమాలు జరిగాయని తానే మొదట బయటపెట్టినట్లు చెప్పారు. నియోజకవర్గానికి వస్తే ప్రోటోకాల్ ప్రకారం రఘురామకృష్ణంరాజుకు సహకరిస్తామని మంత్రి శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు.