దుర్గమ్మకు తొలి సారె సమర్పించిన మంత్రి

ABN , First Publish Date - 2020-06-22T17:43:19+05:30 IST

ఇంద్రకీలాద్రిపై వైభవోపేతంగా ఆషాఢ సారె మహోత్సవం ప్రారంభైంది. దుర్గా దేవికి ఆషాఢమాసం తొలి సారెను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సమర్పించారు. ఈ సందర్భంగా

దుర్గమ్మకు తొలి సారె సమర్పించిన మంత్రి

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవోపేతంగా ఆషాఢ సారె మహోత్సవం ప్రారంభైంది. దుర్గా దేవికి ఆషాఢమాసం తొలి సారెను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శ్రీనివాసరావు.. దేవస్థానం తరఫున ఆషాఢమాస సారెను సమర్పించడం ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, కరోనా మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. కాగా, ఆషాఢంలో ప్రతి ఏడాది పక్క రాష్ట్రాల నుండి వచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తారని చెప్పిన ఆయన.. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు పలు మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. వాటిని భక్తులు తప్పకుండా పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Read more