ఈఎ్‌సఐ అవకతవకలపై నివేదిక కోరాం: కేంద్రం

ABN , First Publish Date - 2020-03-24T09:28:25+05:30 IST

ఏపీలో ఈఎ్‌సఐ నిధుల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌

ఈఎ్‌సఐ అవకతవకలపై నివేదిక కోరాం: కేంద్రం

న్యూఢిల్లీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఏపీలో ఈఎ్‌సఐ నిధుల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ వెల్లడించారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాకినాడలో 100 పడకల ఈఎ్‌సఐ ఆస్పత్రి నిర్మాణానికి సూత్రప్రాయంగా ఆమోదించామని వైసీపీ ఎంపీ మార్గని భరత్‌ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

Read more