కరోనా నివారణపై అధికారులతో మంత్రి సమీక్ష

ABN , First Publish Date - 2020-03-25T16:52:58+05:30 IST

కరోనా నివారణ చర్యలపై సంబంధిత అధికారులతో మంత్రి కొడాలి నాని సమీక్ష జరిపారు. కరోనా వ్యాధిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వాలంటీర్ల ద్వారా 24 గంటల్లో ఇంటింటి సర్వే పూర్తిచేస్తామని

కరోనా నివారణపై అధికారులతో మంత్రి సమీక్ష

కృష్ణా: కరోనా నివారణ చర్యలపై సంబంధిత అధికారులతో మంత్రి కొడాలి నాని సమీక్ష జరిపారు. కరోనా వ్యాధిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వాలంటీర్ల ద్వారా 24 గంటల్లో ఇంటింటి సర్వే పూర్తిచేస్తామని చెప్పారు. ఈనెల 29 నుంచి ఇంటివద్దకే రేషన్ సరుకులు అందజేస్తామని మంత్రి తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యులు, అధికారు సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Read more