బీసీల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: రంగనాథ్‌రాజు
ABN , First Publish Date - 2020-11-03T21:54:45+05:30 IST
బీసీల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి రంగనాథ్‌రాజు అన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ‘జయహో జగనన్న’ బీసీ సభ నిర్వహించారు. మంత్రులు సుచరిత, రంగనాథ్ రాజు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ
గుంటూరు: బీసీల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి రంగనాథ్‌రాజు అన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ‘జయహో జగనన్న’ బీసీ సభ నిర్వహించారు. మంత్రులు సుచరిత, రంగనాథ్ రాజు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, శ్రీకృష్ణదేవరాయులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు
ఈ సందర్భంగా మంత్రి రంగనాథ్ రాజు మాట్లాడారు.. గుంటూరు జిల్లాలో నలుగురిని బీసీ కార్పొరేషన్ చైర్మన్‌లుగా, 46 మందిని డైరెక్టర్లుగా నియమించినట్లు తెలిపారు. అలాగే చైర్మన్, డైరెక్టర్లకు గౌరవ వేతనం ఇచ్చి బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేసేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు.