జగ్గయ్యపేట మృతులను ఆదుకోవాలని పువ్వాడకు కేసీఆర్ ఫోన్
ABN , First Publish Date - 2020-06-18T15:28:25+05:30 IST
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. నిన్న జగ్గయ్యపేటలో ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు
ఖమ్మం: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. నిన్న జగ్గయ్యపేటలో ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలని సూచించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురికి కూడా ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు. నిన్న ప్రమాదంలో తెలంగాణకు చెందిన 9 మంది, ఏపీకి చెందిన ముగ్గురు మృతిచెందారు.