మంత్రి ఒక మాట.. ఆర్టీసీ విరుద్ధ బాట.!
ABN , First Publish Date - 2020-05-17T09:58:24+05:30 IST
రాష్ట్రంలో పీటీడీ నుంచి ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించలేదని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని చెబుతుండగా... తక్షణమే తొలగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పీటీడీ నుంచి ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించలేదని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని చెబుతుండగా... తక్షణమే తొలగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది చేసే పనిని కండక్టర్లతో చేయించుకోవాలని డిపో మేనేజర్లకు సర్క్యులర్ పంపారు.