ఇసుక కొరత రావొద్దు: అధికారులకు పెద్దిరెడ్డి ఆదేశం

ABN , First Publish Date - 2020-09-17T02:09:10+05:30 IST

రాష్ట్రంలో ఇసుక కొరత అనేది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఇసుక కొరత రావొద్దు: అధికారులకు పెద్దిరెడ్డి ఆదేశం

అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత అనేది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఇసుక విధానంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరదల నేపథ్యంలో ఓపెన్‌ రీచ్‌లలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయని చెప్పారు.  స్టాక్‌ యార్డ్‌ల్లో ఉన్న ఇసుకను వినియోగదారులకు సరఫరా చేయాలన్నారు. ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా కొత్త రీచ్‌లను గుర్తించాలని మంత్రి సూచించారు.  అక్రమ ఇసుక రవాణాపై ఇప్పటికే ఎస్ఈబీ దృష్టి సారించి కేసులు నమోదు చేస్తోందని పేర్కొన్నారు. ఏపీఎండీసీ కమాండ్ కంట్రోల్‌ నుంచి కూడా ఇసుక రవాణాను పర్యవేక్షించాలని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టంచేశారు.

Updated Date - 2020-09-17T02:09:10+05:30 IST