దేశంలో ఎక్కడా లేని విధంగా ‘చేయూత’: మంత్రి పెద్దిరెడ్డి

ABN , First Publish Date - 2020-08-19T02:55:27+05:30 IST

దేశంలో ఎక్కడా లేని విధంగా 45 నుండి 60 ఏళ్ల మహిళలకు చేయూత అందిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి రూ.75,000 ఆర్థిక

దేశంలో ఎక్కడా లేని విధంగా ‘చేయూత’: మంత్రి పెద్దిరెడ్డి

విజయవాడ: దేశంలో ఎక్కడా లేని విధంగా 45 నుండి 60 ఏళ్ల మహిళలకు చేయూత అందిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి రూ.75,000 ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. మంగళవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. మొదటి ఏడాదికి చెందిన రూ.18,750 ఇప్పటికే చెల్లించామని చెప్పారు. ఆ డబ్బులు ఎలా పెట్టుబడి పెట్టాలనే నిర్ణయం లబ్దిదారులదే అని అన్నారు. అనేక కంపెనీలతో ఇప్పటికే ప్రభుత్వం ఎంఓయు చేసుకుందని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. బ్యాంకులు కూడా వారికి అండగా నిలుస్తామని చెప్పాయన్నారు. అవసరమైతే ప్రభుత్వం వారికి హామీగా ఉంటుందని చెప్పామని మంత్రి పేర్కొన్నారు. 15 రోజులకు ఒకసారి చేయూతపై సమీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2020-08-19T02:55:27+05:30 IST