-
-
Home » Andhra Pradesh » Minister Peddi Reddy Ramachandra Reddy
-
రాజధాని మార్పుపై ఇప్పుడు మాట్లాడలేం
ABN , First Publish Date - 2020-06-22T09:09:56+05:30 IST
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాజధాని మార్పుల గురించి ఇప్పుడు మాట్లాడలేమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

- జూలైలో కరోనా కేసులు మూడింతలు: మంత్రి పెద్దిరెడ్డి
తిరుపతి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాజధాని మార్పుల గురించి ఇప్పుడు మాట్లాడలేమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అంచనా ప్రకారం ఇప్పుడున్న వాటికన్నా జూలైలో మూడురెట్లు కొవిడ్ కేసులు పెరగనున్నాయన్నారు. అందువల్ల రాజధాని మార్పు కోసం కరోనా తగ్గుముఖం పట్టేంతవరకు వేచి చూడాల్సిందేనని చెప్పారు. ఏదేమైనా ఇటీవల గవర్నర్ తన ప్రసంగంలో చెప్పినట్టు రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.