వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా రాదు: కొడాలి నాని
ABN , First Publish Date - 2020-12-05T18:08:55+05:30 IST
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంపై కొడాలి నాని మాట్లాడుతూ

అమరావతి: వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంపై కొడాలి నాని మాట్లాడుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 మంది అభ్యర్థులను నిలబెట్టలేకపోవడం చంద్రబాబు అసమర్థత. పోటీ చేసిన 106 మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. టీడీపీని జాతీయపార్టీ అని ప్రకటించుకోవడం హాస్యాస్పదం. ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా టీడీపీని చంద్రబాబు పతనం చేశారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు.. ప్రజానేత సీఎం జగన్‌ను ఢీ కొడతాననడం అవివేకం. టీడీపీని చంద్రబాబు గాలి పార్టీగా తయారుచేసి.. ఆయన ఒక గాలి నాయకుడిగా మిగిలిపోయారు’ అని కొడాలి నాని ధ్వజమెత్తారు.