విశాఖ గ్యాస్ లీక్ ప్రాంతంలో బస చేస్తాం: మంత్రి కన్నబాబు

ABN , First Publish Date - 2020-05-11T16:41:15+05:30 IST

విశాఖ గ్యాస్ లీక్ ప్రాంతంలో బస చేస్తాం: మంత్రి కన్నబాబు

విశాఖ గ్యాస్ లీక్ ప్రాంతంలో బస చేస్తాం: మంత్రి కన్నబాబు

విశాఖపట్నం: విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఆరు కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా గ్రామంలో పారిశుద్ధ్య పనులు ప్రారంభించామని మంత్రి కన్నబాబు తెలిపారు. నిపుణుల సూచన మేరకు ఈ రోజు సాయంత్రం నుంచి స్థానికులను గ్రామాలకు తరలిస్తామన్నారు. క్షతగాత్రులకు, స్థానికులకు భరోసా కల్పించేందుకు ఈ రోజు రాత్రి కొంతమంది మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో బస చేయనున్నట్లు తెలిపారు. రేపటి నుండి క్షతగాత్రులకు ప్రభుత్వం  ప్రకటించిన పరిహారం అందజేస్తామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. 


మృతుల కుటుంబాలకు పరిహారం:

మరోవైపు ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రులు ఈరోజు ప్రభుత్వ పరిహారాన్ని అందజేశారు. మృతులు నాగులాపల్లి గ్రీష్మ, శివకోటి గోవిందరాజు, పిట్ల శంకర్రావు, గండిబోయిన శ్రేయ, రావాడ నారాయణమ్మ, మేకా కృష్ణ మూర్తి, చిన్ని గంగరాజు, అన్నెపు చంద్రమౌళి కుటుంబ సభ్యులకు కోటి రూపాయల చొప్పున పరిహారాన్ని అందజేశారు. 

Updated Date - 2020-05-11T16:41:15+05:30 IST