కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి

ABN , First Publish Date - 2020-07-06T02:31:08+05:30 IST

మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారు. కోవిడ్‌ నిబంధనలు తుంగలో..

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి

రాజమండ్రి: మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారు. కోవిడ్‌ నిబంధనలు తుంగలో తొక్కి ఆలమూరు మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం నిర్వహించారు. కనీసం భౌతిక దూరం, మాస్క్‌లు కూడా వైసీపీ కార్యకర్తలు ధరించలేదు. ఆలమూరు మండలంలో ఇప్పటికే 35 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 26 కరోనా కేసులున్న పెనికేరు గ్రామానికి సమీపంలో సభ ఏర్పాటు చేశారు. సుమారు 300 మందితో మంత్రి కన్నబాబు ఈ సమావేశం నిర్వహించారు. 


Updated Date - 2020-07-06T02:31:08+05:30 IST