టీడీపీ ప్రభుత్వ తప్పిదాల వల్లే ఆత్మహత్యలు పెరిగాయి: కన్నబాబు

ABN , First Publish Date - 2020-09-04T01:13:53+05:30 IST

టీడీపీ ప్రభుత్వ తప్పిదాల వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని మంత్రి కన్నబాబు అన్నారు. రైతులు అనేక కారణాలతో

టీడీపీ ప్రభుత్వ తప్పిదాల వల్లే ఆత్మహత్యలు పెరిగాయి: కన్నబాబు

అమరావతి: టీడీపీ ప్రభుత్వ తప్పిదాల వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని మంత్రి కన్నబాబు అన్నారు. రైతులు అనేక కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు.. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇచ్చినట్లు చెప్పారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కూడా పరిహారం చెల్లించినట్లు తెలిపారు. 2020-21లో 49.45 లక్షల మందికి వ్యవసాయ పెట్టుబడి సాయం ఇచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.10,200 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామన్నారు. తొలిసారి పొగాకు కొనుగోళ్లు ప్రారంభించినట్లు చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో కూడా అనేక పంటలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. త్వరలో కొనుగోలు కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు ఉండబోతున్నాయని కన్నబాబు పేర్కొన్నారు.

Updated Date - 2020-09-04T01:13:53+05:30 IST