ప్రజలను గందరగోళ పరచొద్దు: కన్నబాబు

ABN , First Publish Date - 2020-05-10T01:57:01+05:30 IST

విశాఖ ఘటనపై రాజకీయాలు చేసి ప్రజలను గందరగోళ పరచొద్దని విపక్ష పార్టీలకు మంత్రి కన్నబాబు తెలిపారు. శనివారం ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయమై మంత్రి కన్నబాబు మీడియాతో

ప్రజలను గందరగోళ పరచొద్దు: కన్నబాబు

అమరావతి: విశాఖ ఘటనపై రాజకీయాలు చేసి ప్రజలను గందరగోళ పరచొద్దని విపక్ష పార్టీలకు మంత్రి కన్నబాబు కోరారు. శనివారం ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయమై మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై సమీక్ష జరిపామన్నారు. అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. పాలిమర్స్ కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తగ్గిందని మంత్రి తెలిపారు. వాయు ప్రభావం నుంచి బయట పడుతున్నామని చెప్పారు. ఆదివారం సాయంత్రం వరకు ప్రభావిత గ్రామాల ప్రజలను తమ ఇళ్లకు వెళ్లొద్దని చెప్పామన్నారు. ఘటనను పరిశీలించేందుకు కేంద్ర కమిటీ విశాఖకు చేరుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిటీని నియమించిందన్నారు. అదేవిధంగా నాగపూర్‌‌ నుంచి ఒక బృందం వచ్చిందన్నారు. పర్యావరణంపై అధ్యయంన చేస్తుందని చెప్పారు. మెడికల్ అండ్ హెల్త్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి కన్నబాబు వెల్లడించారు. ఆదివారం నుంచే ఈ కమిటీ తన పని మొదలు పెడుతుందన్నారు. విశాఖ ఘటనలో ఇప్పటి వరకు 588 మంది అడ్మిట్ అయ్యారని మంత్రి వెల్లడించారు. 111 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. కాగా, 12 మంది ఈ ఘటనలో మరణించారని, వారి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయని తెలిపారు. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తామని.. సీఎం చెప్పిన ప్రకారం పరిహారం చెల్లిస్తామని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. విశాఖలో ఉన్న అన్ని కెమికల్ పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. గ్యాస్ ప్రభావిత గ్రామాలలో ఉన్న వాటర్ ట్యాంక్‌లు, ఆహార పదార్థాలు వాడవద్దని నిపుణులు చెప్పారని, ప్రజలు దానిని పాటించాలని మంత్రి సూచించారు.

Updated Date - 2020-05-10T01:57:01+05:30 IST