అయ్యన్న ‘బెంజ్ కారు’ ఆరోపణలపై మంత్రి రియాక్షన్ ఇదీ..

ABN , First Publish Date - 2020-09-18T19:46:52+05:30 IST

ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంపై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.

అయ్యన్న ‘బెంజ్ కారు’ ఆరోపణలపై మంత్రి రియాక్షన్ ఇదీ..

కర్నూలు : ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంపై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపరులపై ఫిర్యాదు చేసేందుకు ప్రేవేశపెట్టిన 11440కు లైవ్‌లో కాల్ చేసి మంత్రి కుమారుడు ఈశ్వర్‌పై ఫిర్యాదు కూడా చేశారు. మంత్రి కుమారుడు ఈశ్వర్‌కు, ఇప్పటికే  ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన ఏ-14 కార్తీక్ ఖరీదైన కారును కానుకగా ఇచ్చారని అయ్యన్న ఆరోపించారు. ఏ సంబంధంతో కారును కానుకగా ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ 14 మంత్రి జయరాంకు బినామీ అని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి జయరాం మీడియా మీట్ పెట్టి మరీ స్పందించారు.


మంత్రి రియాక్షన్ ఇదీ...

బెంజ్ కారు నా కుమారునిది కాదు వేరే వాళ్ళది. వేరే వాళ్ల కారు పక్కన ఫోటో దిగాడు అంతే. హెలికాఫ్టర్ దగ్గర, ట్రైన్ దగ్గర ఫోటో తీసుకుంటే మనదే అవుతుందా..?. కారు మాదే అని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. టీడీపీ అధినేత చంద్రబాబుకి, టీడీపీ నాయకులకు మతి భ్రమించింది. గత ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు ఏవైనా పెద్ద పదవులు ఇచ్చారా..?. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేశారు. అయ్యన్న మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాయల పక్కీర్ లాంటివారు. ఎవరిని ఏయే శాఖలో నియమించుకోవాలో అక్కడ తన వారిని నియమించుకొని నాటకాలు ఆడుతున్నారుఅని మంత్రి జయరాం తీవ్ర విమర్శలు గుప్పించారు.

Updated Date - 2020-09-18T19:46:52+05:30 IST