మంత్రి బాలినేని ఎస్కార్ట్‌ వాహనం బోల్తా

ABN , First Publish Date - 2020-07-08T08:21:45+05:30 IST

హైదరాబాద్‌ పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డుపై మంగళవారం ఏపీ మంత్రి బాలినేని శ్రీనివా్‌సరెడ్డి ఎస్కా ర్ట్‌ వాహనం టైరుపేలి బోల్తాపడింది.

మంత్రి బాలినేని ఎస్కార్ట్‌ వాహనం బోల్తా

  • హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి, ముగ్గురికి గాయాలు 


అబ్దుల్లాపూర్‌మెట్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డుపై మంగళవారం ఏపీ మంత్రి బాలినేని శ్రీనివా్‌సరెడ్డి ఎస్కా ర్ట్‌ వాహనం టైరుపేలి బోల్తాపడింది. ప్రమాదంలో ఓహెడ్‌కానిస్టేబుల్‌ మృతి చెందారు. ఇద్దరు కానిస్టేబుళ్లు, డ్రైౖవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ సీఐ దేవేందర్‌ కథనం ప్రకారం.. మంత్రి బాలినేని రెండు ఎస్కార్ట్‌ వాహనాలతో నగరం నుంచి విజయవాడ వెళ్లేందుకు మంగళవారం ఉదయం 10.30 గంటలకు బయలుదేరారు.


పెద్దఅంబర్‌పేట్‌ జంక్షన్‌ సమీపంలోని కొహెడగుట్ట వద్దకు రాగానే ఎస్కార్ట్‌లో ముందు వెళ్తున్న బొలేరో వాహనం వెనుక టైర్‌ పేలిపోయి పల్టీ కొట్టింది. దీంతో అందులో ఉన్న హెడ్‌ కానిస్టేబు ల్‌ బుడ్డ పాపారావు(56)తోపాటు, కానిస్టేబుళ్లు డి.రాజు, వి.సీతారాములు, హోంగార్డు వి.జయకృష్ణకు గాయాలయ్యాయి. వెంటనే హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పాపారావు మృతి చెందారు. 

Updated Date - 2020-07-08T08:21:45+05:30 IST