మంత్రి ధర్మాన మతిచలించి మాట్లాడారు: బుద్ధా వెంకన్న

ABN , First Publish Date - 2020-10-03T22:07:07+05:30 IST

మంత్రి పదవిపోతుందనే ధర్మాన కృష్ణప్రసాద్ మతిచలించి మాట్లాడారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. వెధవలకు పదవులిస్తే ధర్మానలానే మాట్లాడతారని తప్పుబట్టారు.

మంత్రి ధర్మాన మతిచలించి మాట్లాడారు: బుద్ధా వెంకన్న

అమరావతి: మంత్రి పదవిపోతుందనే ధర్మాన కృష్ణప్రసాద్ మతిచలించి మాట్లాడారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. వెధవలకు పదవులిస్తే ధర్మానలానే మాట్లాడతారని తప్పుబట్టారు. మితిమీరి మాట్లాడేవారికి టీడీపీ ప్రభుత్వం రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వంలో అక్రమాలను ప్రశ్నిస్తున్నాడనే మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటిగోడ కూల్చారని, అవినీతిపునాదులపై కట్టిన సీఎం జగన్ ఇంటినే ముందు కూల్చాలని డిమాండ్ చేశారు. దేవుడున్నాడని పదేపదే చెప్పే జగన్‌కు.. రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యే మిగులుతుందని జోస్యం చెప్పారు. కేసులు మాఫీ చేయించుకోవడానికే విజయసాయి ఎంపీ అయ్యారని బుద్దా వెంకన్న విమర్శించారు.

Updated Date - 2020-10-03T22:07:07+05:30 IST