కేంద్రం నుంచి నిధులిప్పించండి!
ABN , First Publish Date - 2020-10-21T08:33:37+05:30 IST
రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులను ఆమోదించి.. కేంద్రం నుంచి నిధులు వచ్చేలా చూడాలని నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్‌కుమార్‌ను

నీతి ఆయోగ్‌కు మంత్రి బుగ్గన వినతి
అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులను ఆమోదించి.. కేంద్రం నుంచి నిధులు వచ్చేలా చూడాలని నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్‌కుమార్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అభ్యర్థించారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు కూడా అవకాశమివ్వాలని కోరారు. బుగ్గన నేతృత్వంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ల బృందం మంగళవారం ఢిల్లీలో రాజీవ్‌కుమార్‌తో సమావేశమైంది.